audio

http://www.esnips.com/doc/2e27b7ac-9938-4b1c-99d6-6182517d796d/2.padyam-teluguvadi-aasti

Monday, 5 December 2011

"దమనకాండ."


అంబేథ్కర్ వర్ధంతి సందర్భంగా 




ప్రకృతి యొసంగు నీరములు పానము సేయగరా దటంచు, హీ
నకులజు లంచు మిక్కిలి యనాదరణంబును జేసి, యంటరా
ని, కనుల గాంచరాని కడు నీచులటంచు సవర్ణ హిందువుల్
వికృతపు జేష్టలన్ కఱకు వేడుక సల్పిరి సొదరాళిపై.

ఎదురు రాకూడదట ! మరి యెదురుపడిన
చెప్పులను చేగొని యొదిగి తప్పుకొనవ
లెనట ! "కుక్కిన పేనువలె" పడియుండ
వలెనట ! యెదురాడక నయవర్తనముల.

నాల్గు వర్ణము లైదయ్యె నరకమయ్యె,
అంటరాదని పొలిమేర గెంటబడిరి
శ్రమను దోచెడు దుర్గతి సంభవించె
అమలు జరిగెను దరుణ "దమనకాండ."

జంతువులకన్న హీనమౌ జన్మ యనుచు,
జీవితంబు దుర్భరమని చింతవడుచు,
దేవుని దరిసింపగలేని దీనులమని
"గుండె చెఱువు" గా బొగిలిరి కుమిలి కుమిలి.

అట్టి యసభ్యవర్తనము, నట్టి యకృత్యము, నట్టి క్రౌర్యమున్,
అట్టి యమానుషంపుబను, లట్టి కుసంస్కృతి, యట్టి నైచ్యమున్,
అట్టి నికృష్టపుంబ్రథను, నట్టి నిరంకుశమైన ధోరణిన్
ఎట్టు సహించిరో కఠిను లెంతలు సేసిరి నిర్దయాత్ములై.

దళిత వర్గాల పాలిట దైవమనగ
దమననీతి దుఃఖితుల కోదార్పులిడగ
"భరత రాజ్యాంగ నిర్మాత" ప్రథితకీర్తి
సదయు డంబేథ్కరుండు నాదుదయమందె.
డా.యస్వీ రాఘవేంద్ర రావు .

No comments:

Post a Comment