audio

http://www.esnips.com/doc/2e27b7ac-9938-4b1c-99d6-6182517d796d/2.padyam-teluguvadi-aasti

Wednesday 30 May 2012

కైలాస సభ 30

సాహితీ రూపకం
దృశ్య చిత్రీకరణ ;యస్.రవి కిశోర్
భాగం 30

Monday 28 May 2012

కైలాస సభ 29

సాహితీ రూపకం
దృశ్య చిత్రీకరణ ;యస్.రవి కిశోర్
భాగం 29

Sunday 27 May 2012

"దేశభక్త్యంతరంగ వీరేశలింగ !"


శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు వర్ధంతి సందర్భముగా 

ఏ మహనీయు డీవి వెలయించి సమున్నత విద్య నిల్పెనో,
ఏ మహనీయు డాత్మ నలరించు శతాధిక కావ్యకర్తయో,
ఏ మహనీయు ధీపటిమ నింతుల వంతలు దూరమయ్యెనో,
ఆ మహనీయు, పూజ్యకవి, నా యుగపూరుషు నాత్మ గొల్చెదన్.

పెంపగు నంధ పద్ధతుల పేర్చిన మూఢుల కుక్కు కత్తియై,
ఇంపుగ సాని కొంపల చరించు విటాళికి ప్రక్కబల్లెమై,
పెంపగు లంచగొండ్ల తగ పీచ మడంపగ గుండెగాలమై,
సొంపగు నీదు సంస్కరణ స్తుత్యము కాదె ? వివేకవర్ధనా !

"రాజశేఖరచరిత్ర" రచించినాడవు
      మూఢవిశ్వాస నిర్మూలమునకు,
ఆంధ్రీకరించితి వత్యంతమును రస
       వంతమ్ముగాగ "శాకుంతలము"ను.
సంతరించితి వతిశ్రమకోర్చి "యాంధ్ర క
       వుల చరిత్రమ్ము" నపూర్వ సరణి,
చిరకీర్తియుతము నీ "స్వీయ చరిత్రమ్ము"
       తత్కాల సాంఘిక దర్పణమ్ము
బహుళ కావ్యమ్ము లాదిగా  పాఠ్య పుస్త
కముల వఱకు శతాధిక గ్రంథవితతి
లలిత సాహితీ ప్రక్రియల వెలయించి
తభినుతంబుగ "గద్య తిక్కన" సమాఖ్య !

భర్త గతాసుడై బ్రతుకు భారముగాగ సమస్త సౌఖ్యసం
హర్త ప్రపంచకర్త " యని యాత్మను క్రుంగి కృశించి నిత్యస
ద్వర్తన ప్రొద్దుపుచ్చెడు వితంతుల వంత దొలంచు సంఘసం
స్కర్తృగణాగ్రగణ్యుడవు గాదె ! "సతీజన లోకబాంధవా !"

అలనా డీ ఘనరాణ్మహేంద్రపురి విద్యాజ్యోతి నీ చేతితో
వెలిగింపంబడి, నే డఖండమగు దీప్తిన్ తేజరిల్లంగ మా
న్యులు, దక్షుల్, కరుణాసముద్రులు, సుధీయుక్తుల్ సమీక్షింపగా
నిల నిష్కంప నివాతమై సతము వర్ధిల్లున్ జగన్మాన్యమై.

"స్త్రీబుద్ధిః ప్రళయాంతకీ" యనుచు, నా స్త్రీబుద్ధికిన్ తోడు వి
ద్యాబంధంబు చెలంగుచో స్థితు లనూహ్యంబంచు వాదించు చిం
తాబద్ధాత్ముల నోర్చి చేసితి విద్యాగంధ విఖ్యాతలన్
పూబోడుల్ నిను విస్మరింపరు సుమీ ! పూజ్యాంధ్రవైతాళికా !

హరిజనులనంగ నా శ్రీ
హరిజనులని గాంధికన్న నతిపూర్వం బీ
ధర చాటి, వారి స్థితి ను
ద్ధరింప సమకట్టి తీవు దళితోద్ధరణా !

మంత్ర తంత్రాచార మహిమ లొప్పకునికి
       "శరభసాళ్వ" ఘటన సాక్షి కాదె ?
పూర్వ సువాసినుల్ పుణ్య సువాసిను
       లగుట నీ ఘనతకు సాక్షి కాదె ?
పాపితి వతివృద్ధ బాల్యవివాహ దు
       రాచారము లలర నాత్మబలము,
ఆంధ్రభూమినె గాక యార్యభూమికి గూడ
       వ్యాపించె నీదు కార్యక్రమంబు,
నీవు నిల్పిన "హితకారిణీ సమాజ
ము" "పుర మందిర మ్మెపుడు నీ పురిని నిలిచి
యుండు మణిదీపిక లగుచు నొప్పిదముగ
"దేశభక్త్యంతరంగ వీరేశలింగ !"

"మహిని మానవ సేవయే మాధవునకు
సేవ " యని సర్వమును లక్ష్యసిద్ధి కొఱకు
త్యాగ మొనరించినాడవు ధన్యజీవి !
తావకీనాత్మశాంతి నిత్యంబు గాదె !

మూగవోయిన వీణ తీగలు సవరించి
       యనురాగ గీతిక లాలపించె,
పరిమళింపక మున్నె వసివాడు కుసుమంబు
       మరల గుబాళించె నరుసమంది,
మోడువారు బ్రతుకు తోడు కల్గుటచేత
       చిగురించి పండెను చిరతరంబు,
శూన్యాభ్రఫాలాన సోమాభతిలకంబు
       పున్నమి వెన్నెలన్ చెన్ను గొలిపె,
ఎవని కృషి నవని ననద యువిద లెల్ల
ముత్తయిదువ లైరి మిగుల మోద మలర
నట్టి వీరేశలింగాఖ్యు నతివ లెల్ల
నిచ్చలు స్మరించి ఋణ మీగి నెగడ దగును.
డా.యస్వీ రాఘవేంద్ర రావు .                           

Saturday 26 May 2012

కైలాస సభ 28

సాహితీ రూపకం
దృశ్య చిత్రీకరణ ;యస్.రవి కిశోర్
భాగం 28

Friday 25 May 2012

కైలాస సభ 27

సాహితీ రూపకం
దృశ్య చిత్రీకరణ ;యస్.రవి కిశోర్
భాగం 27

Thursday 24 May 2012

కైలాస సభ 26

సాహితీ రూపకం
దృశ్య చిత్రీకరణ ;యస్.రవి కిశోర్
భాగం 26

Wednesday 23 May 2012

కైలాస సభ 24

సాహితీ రూపకం
దృశ్య చిత్రీకరణ ;యస్.రవి కిశోర్
భాగం 24

Tuesday 22 May 2012

కైలాస సభ 23

సాహితీ రూపకం
దృశ్య చిత్రీకరణ ;యస్.రవి కిశోర్
భాగం 23

Monday 21 May 2012

కైలాస సభ 22

సాహితీ రూపకం
దృశ్య చిత్రీకరణ ;యస్.రవి కిశోర్
భాగం 22

Sunday 20 May 2012

ఆంధ్రకేసరి

టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భాముగా 

ఉరముం జూపి తుపాకి గుండులకు, రౌద్రోద్రేక దాక్షిణ్య సం
భరితాత్మన్ "సయిమన్ కమీష" నను పెన్బామున్ నిరోధింపగా
వరధైర్యంబను మంత్ర మూను టది శశ్వత్కీర్తి ! యో "యాంధ్రకే
సరి !" నీకే సరి, స్వీకరింపుము ప్రకాశా ! మా నమోవాకముల్.
డా.యస్వీ రాఘవేంద్ర రావు .

Thursday 17 May 2012

కైలాస సభ 21

సాహితీ రూపకం
దృశ్య చిత్రీకరణ ;యస్.రవి కిశోర్
భాగం 21

Wednesday 16 May 2012

కైలాస సభ 20

సాహితీ రూపకం
దృశ్య చిత్రీకరణ ;యస్.రవి కిశోర్
భాగం 20

Tuesday 15 May 2012

భక్తిగీతాలు 9


       రచన: డా|| యస్వీ. రాఘవేంద్రరావు
         (మాంగల్యబలం" చిత్రంలోని "పెనుచీకటాయె లోకం" వరుస)


పల్లవి|| కరుణించరావా దేవా ! - కనిపించవేరా రామా ! ||
        నీపాదకమలార్చనమే - నమ్మియుంటిరా !            ||కరుణించ||
 చ|| ౧. కరుణారససాగర రామా ! - కాపాడరా !
        ధర దుర్లభ మానవజన్మను - ధన్యమొనర్తురా !
        ప్రపంచమె మాయైపోయె - బ్రతుకే కలయైపోయె
        నీపాదకమలార్చనమే - నమ్మియుంటిరా !            ||కరుణించ||
 చ|| ౨.ఎపుడేగునో ఏమో ? - ఎచటేగునో ప్రాణం ?
        నీపాదసేవయె నిజమని -నిన్ను కొలుతురా !
        దీవించవేరా రామా ! - దరిజేర్చరావా దేవా !
        నీపదకమలార్చనమే - నమ్మియుంటిరా !              ||కరుణించ||

Sunday 13 May 2012

కైలాస సభ 19

సాహితీ రూపకం
దృశ్య చిత్రీకరణ ;యస్.రవి కిశోర్
భాగం 19

Saturday 12 May 2012

భక్తిగీతాలు 8


          రచన: డా|| యస్వీ. రాఘవేంద్రరావు
       ("ఇలవేలుపు" చిత్రం లోని "అన్నా! అన్నా! విన్నావా!" పాట వరుస)


పల్లవి||  నందకుమార రారా ! - నవనీతచోర రారా !
         దానవవంశ వినాశకరా ! - దర్శనమీయగ జాగేల ?              ||నంద||
 || ౧.  మన్ను తిన్నావని అన్ననగా - అమ్మకు చూపితి భువనాల
         మాకుల రోటను గూలిచి నీవు - బాపితి శాపము లవలీల       ||నంద||
 చ|| ౨. గోపబాలల జుట్టు ముడేసి - గోవత్సము లదలించినవాడా !
         గోపికరమణుల పుట్టములనుగొని - గోప్యముగా చెట్టెక్కినవాడా ! ||నంద||
 చ|| ౩.  గోవర్ధనగిరి నెత్తినవాడా ! - గోకులరక్షక గోపాలా !
         కాళియమర్దన ! కృపజూడ - కంస సంహరణా ! రావేలా !         ||నంద||
 చ|| ౪. గోపికలోలా ! నీలీల - కానగ నేరికి తరమౌను ?
         కరుణాసాగర ! రావేల - కావగదాసుని రాఘవుని                ||నంద||

Thursday 10 May 2012

కైలాస సభ 18

సాహితీ రూపకం
దృశ్య చిత్రీకరణ ;యస్.రవి కిశోర్
భాగం 18

Tuesday 8 May 2012

భక్తిగీతాలు 7


       రచన: డా|| యస్వీ. రాఘవేంద్రరావు
        ("సత్యలింగ నాయకరునకు సఖియ హారతులివ్వరే" పాట వరుస)
పల్లవి||  జానకీ రఘురాములకును - సఖియ హారతి నివ్వరే !             ||జానకీ||
 || ౧. పట్టుదలతో హరునిచాపము - పట్టి నడిమికి ద్రుంచెనే
         మట్టిబుట్టిన జానకమ్మను - పట్టమహిషిగ చేకొనె
         చట్టురాయై యున్న అహల్యకు - అట్టె శాపము బాపెనే
         అట్టి రాఘవునకు పళ్ళెము - పట్టి హారతి నివ్వరే !                     ||జానకీ||
  చ|| ౨.ఘోర రావణ కుంభకర్ణుల - గర్వమడచిన శూరుడే
         మేరునగసమధీరుడే మన - మారుతాత్మజు బ్రోచెనే
         కరుణజలనిధి రాముడే - మన మారుతాత్మజు బ్రోచెనే
         కారణార్థము జననమొందిన - కరుణజలనిధి రాముడే
         అరిభయంకర దాశరథికి - హారతివ్వగ రాగదే ||                          ||జానకీ||

Monday 7 May 2012

కైలాస సభ 17

సాహితీ రూపకం
దృశ్య చిత్రీకరణ ;యస్.రవి కిశోర్
భాగం 17

Sunday 6 May 2012

భక్తిగీతాలు 6


       రచన: డా|| యస్వీ. రాఘవేంద్రరావు 
               (  "జయసింహ" చిత్రంలోని "ఈనాటి ఈ హాయి" పాట వరుస)
          
పల్లవి||  నీలీల తెలియగనూ - ఇలనెవ్వారి తరమౌను     ||నీలీల||
 చ|| ౧.  నీతలపుతోనే - తపియించిపోయే
         ఈతనువు నీదమ్మా !
         నీసేవలే నా సౌభాగ్యమమ్మా !
         నాశ్రీయు నాసౌఖ్య మీవేకదా !                   ||నీలీల||
     ౨.  ఏనాటి తపమో - ఏ పుణ్యఫలమో !
         ఈనాటి ఈ జన్మా
         నీపూజలే యిక నిరతంబు నేను 
         నీమముగ నొనరించి తరియింతునూ             ||నీలీల||
     ౩.  మురిసేములే - మైమఱచేములే ఇక నీ
         నీచరణపూజలతో
         దారిద్ర్యమనెడి శార్దూలవాత
         ఎర రీతి బడకుండ కాపాడుమా !                ||నీలీల||

Saturday 5 May 2012

కైలాస సభ 16

సాహితీ రూపకం
దృశ్య చిత్రీకరణ ;యస్.రవి కిశోర్
భాగం 16

Friday 4 May 2012

భక్తిగీతాలు 5


          రచన: డా|| యస్వీ. రాఘవేంద్రరావు
          ((చాయ: "చక్రపాణి" చిత్రంలోని "ఉయ్యాలజంబాల")


పల్లవి||   జైలక్ష్మి ! జైలక్ష్మి ! అనుచు పాడరా !
          జగతిలోన నీజన్మ సార్థకము చేయరా !          ||జైలక్ష్మి||
 చ|| ౧.   క్షీరసాగరుని యనుగుపట్టియై పుట్టి
          క్షీరాంబుధిశయనుని చెయి ముదమున చేపట్టి
          వైకుంఠము మెట్టిన వందితవరలక్ష్మి !
          ఇక్కట్టు లెట్టివైన ఇట్టె పోగొట్టు తల్లి !              ||జైలక్ష్మి||
   చ|| ౨. సుఖదు:ఖము లెన్నగా సంసారజలధిలో
          తరంగాలె గావా తలపగ నోజీవా !
          ఎఱిగుండియు మానవులిక వెఱపుజెందనేల ?
          శ్రీలక్ష్మినె సతతము మది స్మరియింపగలేరా ?     ||జైలక్ష్మి||
   చ|| ౩. ఎట్టి తాపసులనైన ఇట్టె చలనమొనరించు  
          నట్టి కామునిగన్న కరుణాలవాల !
          రమణుల సౌభాగ్యలక్ష్మి రాజీవనేత్ర !
          రక్షించగ వేగరావె దాసుని రాఘవుని               ||జైలక్ష్మి||

Thursday 3 May 2012

కైలాస సభ 15

సాహితీ రూపకం
దృశ్య చిత్రీకరణ ;యస్.రవి కిశోర్
భాగం 15

Wednesday 2 May 2012

భక్తిగీతాలు 4


రచన: డా|| యస్వీ. రాఘవేంద్రరావు
 ("భలేరాముడు" ఫిల్ములోని "ఓహో ! మేఘమాలా !" వరుస)

పల్లవి: ఓహో !..... రమాదేవీ ! - కాపాడు జగన్మాతా !
        కావగ రావేలా ? - నను బ్రోవగ రావేలా ?                 ||ఓహో||
 చ||.౧. దీనజనులకు కల్పతరువని - నమ్మియున్నాను
        నిను నే కొలుచుచున్నాను
        భక్తి నొసగి - ముక్తి నిచ్చి ||
        కాచి రక్షించు  -  నను కరుణతో జూడు                  ||కావగ||
 చ||౨. భారమంతా నీపై నిల్పి - మిన్నకున్నాను
        మై మఱచి యున్నాను
        నీట ముంచిన - పాల ముంచిన ||
        నీవె గతి నాకు - నీవె నాకు గతి                        ||కావగ||
  చ||౩. నిన్ను కొలిచిన భక్త జనులకు - ఏమి కొఱతుంది ?
        లేమి ఏముంది ?
        అభయమిచ్చి - కృపను జూపి ||
        నన్ను దీవించు -  నిన్ను భజియింతు                  ||కావగ||

Tuesday 1 May 2012

కైలాస సభ 14

సాహితీ రూపకం
దృశ్య చిత్రీకరణ ;యస్.రవి కిశోర్
భాగం 14