రచన: డా|| యస్వీ. రాఘవేంద్రరావు
("భలేరాముడు" ఫిల్ములోని "ఓహో ! మేఘమాలా !" వరుస)
కావగ రావేలా ? - నను బ్రోవగ రావేలా ? ||ఓహో||
చ||.౧. దీనజనులకు కల్పతరువని - నమ్మియున్నాను
నిను నే కొలుచుచున్నాను
భక్తి నొసగి - ముక్తి నిచ్చి ||
కాచి రక్షించు - నను కరుణతో జూడు ||కావగ||
చ||౨. భారమంతా నీపై నిల్పి - మిన్నకున్నాను
మై మఱచి యున్నాను
నీట ముంచిన - పాల ముంచిన ||
నీవె గతి నాకు - నీవె నాకు గతి ||కావగ||
చ||౩. నిన్ను కొలిచిన భక్త జనులకు - ఏమి కొఱతుంది ?
లేమి ఏముంది ?
అభయమిచ్చి - కృపను జూపి ||
నన్ను దీవించు - నిన్ను భజియింతు ||కావగ||
No comments:
Post a Comment