రచన: డా|| యస్వీ. రాఘవేంద్రరావు
(మాంగల్యబలం" చిత్రంలోని "పెనుచీకటాయె లోకం" వరుస)
పల్లవి|| కరుణించరావా దేవా ! - కనిపించవేరా రామా ! ||
నీపాదకమలార్చనమే - నమ్మియుంటిరా ! ||కరుణించ||
చ|| ౧. కరుణారససాగర రామా ! - కాపాడరా !
ధర దుర్లభ మానవజన్మను - ధన్యమొనర్తురా !
ప్రపంచమె మాయైపోయె - బ్రతుకే కలయైపోయె
నీపాదకమలార్చనమే - నమ్మియుంటిరా ! ||కరుణించ||
చ|| ౨.ఎపుడేగునో ఏమో ? - ఎచటేగునో ప్రాణం ?
నీపాదసేవయె నిజమని -నిన్ను కొలుతురా !
దీవించవేరా రామా ! - దరిజేర్చరావా దేవా !
నీపదకమలార్చనమే - నమ్మియుంటిరా ! ||కరుణించ||
No comments:
Post a Comment