audio

http://www.esnips.com/doc/2e27b7ac-9938-4b1c-99d6-6182517d796d/2.padyam-teluguvadi-aasti

Wednesday 31 August 2011

విఘ్నపతి స్తుతి

వినాయక చవితి శుభాకాంక్షలతో 
1/09/2011


అమరుల్ జన్మదినంబునాడు నను నాహ్వానించి యర్చించు                          
ప్రమితాభీష్టములైన యా  కుడుములుండ్రాళ్లేన్ భుజింపంగ, భా       
 రముగా మూషిక మీడ్చుచుండ,నగెఁ దారానాథుఁ డాదృష్టిదో      
 షమునన్ విచ్చిన పొట్ట కుట్టెనని యా శర్వాణికిం జెప్పు             
 స్తిముఖున్ గొల్చెదసిద్ధిబుద్ధికరునిన్ చేతోంబుజస్వచ్ఛునిన్
 డా .యస్వీ  రాఘవేంద్ర రావు .

Tuesday 23 August 2011

మాతృభాష

మాతృభాష
ఆపాత మధురమై యానందమందించు                                                                                
           దివ్య వాక్సతి మన తెనుగుభాష,                                                                                      
 ఆలోచనామృతమై ఆనందమందించు                                                                                  
           తియ్యందనంబుల తెనుగుభాష,                                              
 జగతినజంతభాషగ కీర్తి గడియించు                                          
           తేటతెలుగు నుడుల తెనుగుభాష,                                             
 సరసాంగి యనుకూల సరళయై యొదిగెడు                                    
           దేవభాషాపుత్రి తెనుగుభాష                                                  
 అట్టి భాష నేర్చుకొనుట యట్టి దేశ                                          
 మందు పుట్టుటయునునన్న నల్ప ఫలమె?                               
 అది తపఃఫలంబనుట యథార్థ మయ్య !                                                                                          
 మాతృభాషను సేవించి మనగదయ్య

కోకిలమ్మ పాటయు, పసికూన ముద్దు
మాట, ముత్యాల మూటయు, మల్లె తోట,
తేటిపాట, నెమలియాటతేనెయూట
జగతిని తెనుగు మాటకు సాటి రావు.

తే.గీ. చలువ వెన్నెలయు,జిలుగు వలువ, చెలియ
కులుకు, కలువచెలువమును,చిలుక పలుకు,
మలయ పవనంబు, సెలయేటి కలరుతంబు
తులయగునె యిలను తెలుగు పలుకుబడికి.

పరిరక్షించెను పూర్వ సంస్కృతి కళాపారమ్య రమ్యాకృతిన్
వరలెన్నీత్యుపదేశ వాఙ్మధురస స్వాదుత్వసంపన్నయై,
తరుణీసమ్మిత కావ్యసౌరభలసత్సన్తుష్ట దిక్చక్రమై,
విరిసెన్ వేయిదళాలపద్మమయి యీ వేయేండ్ల సాహిత్యమే
డా .యస్వీ రాఘవేంద్ర రావు .
29/08/2011 మాతృభాషా దినోత్సవం సందర్భముగా శుభాకాంక్షలతో 

Saturday 20 August 2011

ఆంధ్ర కేసరి నీకే సరి

ఆంధ్ర కేసరి 
 
ఉరముం జూపి తుపాకి గుండులకు, రౌద్రోద్రేక దాక్షిణ్య సం
భరితాత్మన్ "సయిమన్ కమీష" నను పెన్బామున్ నిరోధింపగా
వరధైర్యంబను మంత్ర మూను టది శశ్వత్కీర్తి ! యో "యాంధ్రకే
సరి !" నీకే సరి, స్వీకరింపుము ప్రకాశా ! మా నమోవాకముల్.
డా .యస్వీ  రాఘవేంద్ర రావు .
23 ఆగష్టు  శ్రీ  టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భము గా 

Thursday 18 August 2011

బహుభాషా సంక్రాంతి కవి సమ్మేళనం

  త్రివేణి సమ్మేళనం
బహుభాషా సంక్రాంతి కవి సమ్మేళనం

 

స్వర్ణయుగ ప్రబంధ వైభవం

ఆంధ్ర పద్యకవితా సదస్సు,తూ.గో.జిల్లా శాఖ.
సి  అండ్  డి  అసోసియేషన్  
స్వర్ణయుగ ప్రబంధ వైభవం

చతుర్భాషా భావి భావన సమ్మేళనం

త్రివేణి సమ్మేళనం
చతుర్భాషా భావి భావన సమ్మేళనం

పంతులు గారి 125 వ జన్మదినోత్సవ ప్రత్యెక సంచిక

హితకారిణీ  సమాజం
పంతులు గారి 125 వ జన్మదినోత్సవ ప్రత్యేక సంచిక

పద్య ప్రక్రియ పై పరిశోధన

ఆంధ్ర పద్యకవితా సదస్సు,తూ.గో.జిల్లా శాఖ.
పద్య ప్రక్రియ పై  పరిశోధన  
 

సాహిత్య ప్రవాహం

ఆంధ్ర పద్యకవితా సదస్సు,తూ.గో.జిల్లా శాఖ.
 
 

అభినందన

అభినందన

 

 

సరసకవి

కవిత్రయ మహాభారతం జాతీయ సదస్సు

 టి.టి.డి 
కవిత్రయ మహాభారతం జాతీయ సదస్సు
 

భువన విజయం

బచ్చు ఫౌండేషన్, పెద్దాపురం
భువన విజయం

Wednesday 17 August 2011

షడ్భాషా స్త్రోత్ర సమ్మేళనము

ఆంధ్రకేసరి యువజన సమితి 
షడ్భాషా స్త్రోత్ర సమ్మేళనము 

"మహాదాత"

 శ్రీ మల్లాడి సత్యలింగంనాయకరు


                 1969 లో స్వర్ణోత్సవ సంవత్సరం లో ఎమ్.ఎస్.యెన్.సి ఎలెమెంటరీ స్కూల్ అధ్యాపక బృందం.


     "మహాదాత" శ్రీ సత్యలింగంనాయకరుగారి ప్రశస్తి

చదువు వలన మానిసికి సంస్కార మబ్బు
చదువకయె నీ కనుపమ సంస్కార మబ్బె
పూర్వపుణ్యంబు కతన, నపూర్వ పుణ్య
చరిత ! నిరతాన్నదాత ! శిక్షాప్రదాత !
నిత్యసత్యకీర్త్యంగ ! శ్రీ సత్యలింగ !

"కోటికి పడగలెత్తిరి కోట్లకొలది"
నీసరి యశోధనులు లేరు నిక్కముగను
కలిమిబలిమిన్ నరుడు యశఃకాయు డగునె ?
ఇలను దానధర్మంబుల వలనగాక !
నిత్యసత్యకీర్త్యంగ ! శ్రీ సత్యలింగ !

మూడడుగులే యొసగె బలిభూవిభుండు,
మాంసలేశము నిడె శిబి మనుజపతియు,
అస్థిశకలమిచ్చె దధీచి, యట్లుగాక
సకలమిచ్చి తీ వొకడవె జగతిలోన
నిత్యసత్యకీర్త్యంగ ! శ్రీ సత్యలింగ !

ధర్మరథ మనియెడు నీదు ధర్మసంస్థ
ధర్మకర్తలను ఘనబోధకుల కతన
సాగుచున్నది వేఱొండు సాటిలేక
శాంతి బొందగ నీయాత్మ శాశ్వతముగ
నిత్యసత్యకీర్త్యంగ ! శ్రీ సత్యలింగ !

గాన, నాట్య, కవిత్వాది కళలయందు
రాజకీయార్థిక ప్రజారంగములను,
వైద్య సాంకేతికాదిక విద్యలందు
ఘనతకెక్కిన పుత్రుల కన్నతల్లి !
రమ్యగుణవల్లి ! పాఠశాలామతల్లి !

దివిజ మనుజవరులు మెచ్చు దేశభక్తి
శమదమ కరుణ సత్యాది సద్గుణముల
తీర్చి దిద్దితివి సుతుల దివ్యమాత !
అందుకోవమ్మ మా హృదయాంజలులను
రమ్యగుణవల్లి పాఠశాలామతల్లి !

విధప్రాంతముల వసించి వివిధగతుల
నిఖిలజగతి కీర్తిని చాటు నీదుసుతుల
కాయురారోగ్యభాగ్యము లందజేసి
చిరము మనజేయుమమ ! శుభాశీస్సు లొసగి
రమ్యగుణవల్లి ! పాఠశాలామతల్లి !

రంగురంగు తోరణముల్ కళకళలాడ,
రమ్య విద్యుత్ప్రభలును తళతళలాడ,
బాలికల నృత్యగానముల్ లీల మ్రోగ,
ప్రేక్షకుల కమితమగు నపేక్షగొలుప
నుల్లసంబుగ జరిగె స్వర్ణోత్సవంబు.

పౌరులెల్లరు నీకు గౌరవమునుజూప,
      పూర్వవిద్యార్థులు పూని నిలువ,
సురవరు లనిశంబు శుభశాంతులను గోర
       ఒజ్జలందఱు నీదు పజ్జనుండ,
తల్లిదండ్రులు నీదు ధన్యత కీర్తింప,
       బాలబాలికలు జేజేలు పలుక,
సాహిత్యవేత్తలు సంతతము పొగడ
       సత్యలింగార్యుడు స్వస్తి పలుక,
అప్పరావార్యుడును నీదు గొప్పచాట
అల్ల వెంకతనారాయణాదృతిగని
సత్యనారాయణుడు నిన్ను సన్నుతింప
ఉజ్జ్వలంబుగ జరుగు వజ్రోత్సవంబు,
డా .యస్వీ  రాఘవేంద్ర రావు 
.(శ్రీ మల్లాడి సత్యలింగంనాయకరు చారిటీసు ప్రాథమిక పాఠశాల, జగన్నాధపురం,కాకినాడ స్వర్ణోత్సవ (౧౯౧౯-౧౯౬౯) ప్రత్యేక సంచికలో ౧౯౬౯లో ప్రచురితము.)

    " మహాదాత " శ్రీ మల్లాడి సత్యలింగంనాయకరుగారి మీద
                  "మంగళహారతి"
       ( రచన: మా మేనత్తగారు శ్రీమతి పెమ్మాడి అన్నపూర్ణమ్మగారు)

పల్లవి: సత్యలింగ నాయకరునకు  సఖియ హారతు లివ్వరే !
        పసిడి పళ్ళెరముల బూని  బాలిక లందఱును                   /సత్య/
చ: ౧.  పేదలకు పెన్నిధియు  పెరటి కల్పవృక్షము       
        అధిక ధనము నొసగి దివికి  ఆయన వేంచేసెను                 /సత్య/
చ.౨. వాసిగా చొల్లంగి తీర్థవాసులు తరియింపగా
       గుడులు గోపురములు కట్టి ముక్తి మార్గము చూపిన
   ౩.  పల్లవకులమందు పుట్టి పరమధార్మికుడాయెనే
       బాలలారా భక్తితోడ ప్రస్తుతించి మ్రొక్కరే                   /సత్య/
   ౪.  అధికదానపరుడు తాత ఆత్మశాంతి కొఱకునై
         దీక్షతోడ తర్పణంబులు విడుచుచుండె మనుమడు              /సత్య/
   ౫.   చిన్నసత్యలింగమునకు సిరులు హెచ్చునట్లుగా
         దైవప్రార్థన చేయుడందఱు ధన్యవాదము లొసగుచు              /సత్య/
    ౬.   కోరంగిపుర నివాసిని అన్నపూర్ణ తోడను
          అతివలారా ! తాత కొసగరె వందనశతంబులు                    /సత్య/


( ఈ మంగళహారతిని శ్రీ మల్లడి సత్య్లింగంనయకరుగారి వర్ధంతికి ప్రాథమికపాఠశాల బాలికలచే పాడించుచుందురు. ఇప్పటికిని ఈ ఆచారముకొనసాగుతూనే ఉన్నది) 
 రచయిత్రి
శ్రీమతి పెమ్మాడి అన్నపూర్ణమ్మ

నేదునూరి గ్రంథాలయం


అలరించిన సాంస్క్రుతిక కార్యక్రమాలు

అంత్య పుష్కరాల సందర్భముగా  
అలరించిన సాంస్కృతిక
 
కార్యక్రమాలు


ఉగాది వేడుకలు

త్రివేణి సమ్మేళనం 
ఉగాది వేడుకలు

శ్రీ మద్రామాయణ కల్పవృక్ష సమారాధన

శ్రీ మద్రామాయణ  కల్పవృక్ష  సమారాధన


శివలీలా వైభవ సందర్శనం

తెలుగు పద్యం చిరంజీవి

కవిత్వానికి సామాజిక స్పృహే భూమిక

  సరస్వతి సపర్యా మహోత్సవం
కవిత్వానికి  సామాజిక  స్పృహే భూమిక
 

పద్యానికి కాలం చెల్లిపోలేదు

భాషా సమితి ,రాజమండ్రి
పద్యానికి కాలం చెల్లిపోలేదు
 

పద్య కవిత్వం శాశ్వతం

 ద్రాక్షారామం భువనవిజయం సభ
పద్య కవిత్వం శాశ్వతం