audio

http://www.esnips.com/doc/2e27b7ac-9938-4b1c-99d6-6182517d796d/2.padyam-teluguvadi-aasti

Monday 27 February 2012

సువర్ణ యోగి




ప్రసన్న భారతి కవితా వాహిని కవితా సంకలనం లో ప్రచురించబడినది 
రచన: డా.యస్వీ.రాఘవేంద్రరావు

Saturday 25 February 2012

రామకృష్ణ పరమహంస రమ్యధామ !

    
సీ. "కోరికలను వీడి కూర్మి సంతుష్టితో
                    మనసు స్వామిపయిన నునుచుడయ్య !"
          "అన్నము వండితి నందరు కూర్చొని
             భోజనంబును సేయ పూనుకొనుడు !"
                "మూస సిధ్దంబయ్యె, ముక్తమానసముల
     పూనికతో పోత పోసికొనుడు !"
              "కామినీకాంచన కామమోహము లేది
          సాధకా ! సల్పుము సాధనంబు !"

            గీ. ఇట్టి "బోధనామృత" మిచ్చినట్టి యోగి !
             ఘనత మించిన శిష్యుని గన్న ధన్య !
        భక్తి జగదంబ గాంచిన భాగ్యశాలి !
               రామకృష్ణ పరమహంస ! రమ్యధామ
రచన: డా.యస్వీ.రాఘవేంద్రరావు

అష్టావధానం





Wednesday 22 February 2012

Tuesday 21 February 2012

Monday 20 February 2012

మోహినీ అవతారం

మహాశివరాత్రి శుభాకాంక్షలు 
  శ్రీవేంకటేశ్వరస్వామి వారి
      బ్రహ్మోత్సవ వాహనవైభవం,


   తే. తను జగన్మోహినీరూప ధారణమున
             దేవతల కమృతం బిచ్చిన దివ్యు డదిగొ
          మోహినీయవతారాన ముద్దులొలుక,
     వెన్నముద్దను జేపట్టి వెన్నదొంగ
         వేఱు వేఱు వాహనముల వేడ్కతోడ
   భక్తకోటిని పాలింప వచ్చె నేడు.
రచన: డా.యస్వీ.రాఘవేంద్రరావు

Sunday 19 February 2012

అశ్వవాహనం


  శ్రీవేంకటేశ్వరస్వామి వారి
      బ్రహ్మోత్సవ వాహనవైభవం,  శ్రీనివాస మంగాపురం 
                 తే.శిష్టరక్షణంబును దుష్టశిక్షణమును
                          జేయ ధరణి నవతరించు శ్రీశు డదిగొ !
                           ఖడ్గధారియై వధియింప కలిపురుషుని
                      అశ్వవాహనమున ఠీవి నధివసించి
                       కల్కిరూపుడై స్వామి సాక్షాత్కరించె.  
 రచన: డా.యస్వీ.రాఘవేంద్రరావు

Saturday 18 February 2012

స్వర్ణరథోత్సవం

  శ్రీవేంకటేశ్వరస్వామి వారి
      బ్రహ్మోత్సవ వాహనవైభవం, శ్రీనివాస మంగాపురం 
         తే. దాసభక్తుల నృత్యాలు వాసి గాంచ
                         భజనబృందాలు ముందుగా వచ్చుచుండ
          వేడ్క శ్రీదేవి భూదేవి వెంటరాగ
               సాగె నల్లదే శ్రీస్వామి స్వర్ణరథము
                              కనులు మిరుమిట్లుగొల్పెడు కాంచుడయ్య !
 రచన: డా.యస్వీ.రాఘవేంద్రరావు

చంద్రప్రభవాహనం


  శ్రీవేంకటేశ్వరస్వామి వారి
      బ్రహ్మోత్సవ వాహనవైభవం,  శ్రీనివాస మంగాపురం 
                         
                      తే. చంద్రసూర్యులు నీదు లోచనములయ్య !
             చంద్రికాతిశీతలము నీ చల్వచూపు
        కోటిచంద్రప్రకాశ ! కోనేటిరాయ !
                   చేత వెన్నముద్దను దాల్చి చిన్నికృష్ణ !
                వెన్నెలందున విహరించు వేడ్కమీఱ
             భక్తపాల ! చంద్రప్రభవాహనము
                       మాడవీదుల విహరించు మహితమూర్తి !
                 శ్రితజనులను రక్షింపుము శ్రీనివాస 
 రచన: డా.యస్వీ.రాఘవేంద్రరావు

సూర్యప్రభవాహనం

  శ్రీవేంకటేశ్వరస్వామి వారి
      బ్రహ్మోత్సవ వాహనవైభవం, శ్రీనివాస మంగాపురం 

                         తే. చంద్రసూర్యులే నీదు వీక్శణములయ్య !
                      కోటిసూర్యప్రకాశ ! యో కూర్మిదేవ !
                     భవ్యదివ్యసూర్యప్రభ వాహనము
                            తరలివచ్చితి వరద ! యో తిరుమలేశ !
                              ధన్యులము మేము నీ దివ్యదర్శనమున.
 రచన: డా.యస్వీ.రాఘవేంద్రరావు

Friday 17 February 2012

గజవాహనం


  శ్రీవేంకటేశ్వరస్వామి వారి
      బ్రహ్మోత్సవ వాహనవైభవం, శ్రీనివాస మంగాపురం 

           తే. ఇంద్రు డంపిన యైరావతేభమందు
               వైభవోపేతముగ స్వామి వచ్చె నేడు
               శ్వేతగజమున వేవేల వెలుగు నింపి
                   భక్తహృదయపద్మమ్ములు పరిమళింప
                    ప్రముదమంది బ్రహ్మోత్సవ వర్తనముల
                          నింద్రుడు కురియించెను పుష్పవృష్టి నేడు.
 రచన: డా.యస్వీ.రాఘవేంద్రరావు

Thursday 16 February 2012

హనుమద్వాహనం



  శ్రీవేంకటేశ్వరస్వామి వారి
      బ్రహ్మోత్సవ వాహనవైభవం, శ్రీనివాస మంగాపురం 

                   తే. రాము నమ్మినబంటుగా రాణకెక్కి,
                 స్వామిభక్తిపరాయణవరు డనంగ
                               ఘనతనొందిన యంజనాతనయు డదిగొ !
                         శ్రీశు దనమూపుపై బెట్టి మోసికొనుచు
                                     వచ్చె నదె కాంచుడు "హనుమద్వాహనంబు."
 రచన: డా.యస్వీ.రాఘవేంద్రరావు

గరుడ వాహనం

  శ్రీవేంకటేశ్వరస్వామి వారి
      బ్రహ్మోత్సవ వాహనవైభవం, శ్రీనివాస మంగాపురం 

ఉ. శ్రీహరి కృష్ణదేవులకు సేవకుదౌ "గడాళువారు" తా
    వాహనమయ్యె శేషగిరివాసున కీ కలిలో గిరీంద్రమై
                    యాహవదోహదుం డయిన యా గరుడుండు నివాసమై; ప్రజా
                   వాహిని బ్రోవ శ్రీపతియై వచ్చెను బ్రహ్మమహోత్సవంబులన్.
 రచన: డా.యస్వీ.రాఘవేంద్రరావు

Wednesday 15 February 2012

సర్వభూపాలవాహనం

  శ్రీవేంకటేశ్వరస్వామి వారి
      బ్రహ్మోత్సవ వాహనవైభవం, శ్రీనివాస మంగాపురం 


         తే. అష్టదిక్పాలభూపాలు రందరైరి
              స్వామి మలయప్పవారికి వాహనముగ
              పట్టమహిషులతో గూడి పట్టణమున
              మాడవీదుల నూరేగి మహితమూర్త       
              భక్తజనుల బ్రోవగ ననురక్తితోడ
              కాళియవిమర్దనుండయి కానుపించి
              సర్వభూపాలవాహనమున స్వామి వచ్చె
              కనుడు జనులార ! కన్నులకఱవు దీఱ.
 రచన: డా.యస్వీ.రాఘవేంద్రరావు

ముత్యపుపందిరి వాహనం


  శ్రీవేంకటేశ్వరస్వామి వారి
      బ్రహ్మోత్సవ వాహనవైభవం, శ్రీనివాస మంగాపురం 

ఉ. ఆశ్రితకల్పవృక్షమగు నా వకుళాతనయుండు కృష్ణుడై
   విశ్రుత గోపబాలుడయి వేడుక గోవులపాలకుండుగా
           నాశ్రయకల్పవృక్ష మహిమాన్విత వాహనమందు వచ్చె ని
       త్యాశ్రితభక్తకోటి మహిమాన్వితుడై వరదుండు బ్రోవగన్.
 రచన: డా.యస్వీ.రాఘవేంద్రరావు

Tuesday 14 February 2012

సింహవాహనం

  శ్రీవేంకటేశ్వరస్వామి వారి
      బ్రహ్మోత్సవ వాహనవైభవం, శ్రీనివాస మంగాపురం 



           తే. స్వామి మలయప్ప యల సింహవాహనమున
              మాడవీదుల నూరేగి మమ్ము బ్రోవ
              దర్శనంబీయ మాజన్మ ధన్యమయ్యె
              నాటి ప్రహ్లాదవరదుడా ! నారసింహ !
              వేంకటేశ్వర నిన్ను నే వేడుకొందు.
 రచన: డా.యస్వీ.రాఘవేంద్రరావు

హంసవాహనం

  శ్రీవేంకటేశ్వరస్వామి వారి
      బ్రహ్మోత్సవ వాహనవైభవం, శ్రీనివాస మంగాపురం 


    ఉ. వెన్నెలవన్నె మైమెఱుపు వెల్లనివల్వలు వీణె దాల్చియున్
      వెన్నెల చల్వచూపులను వెల్లువగొల్పు కృపారసంబునన్
వెన్నెలవంటి కీర్తి నిల విద్దెలు నేర్చినవారికిచ్చుచున్
         వెన్నెలవేళ నంచపయి వేడుక వచ్చెడు స్వామి గొల్చుడీ !.
 రచన: డా.యస్వీ.రాఘవేంద్రరావు

Monday 13 February 2012

చిన్నశేషవాహనం

  శ్రీవేంకటేశ్వరస్వామి వారి
      బ్రహ్మోత్సవ వాహనవైభవం, శ్రీనివాస మంగాపురం 

      
     తే. వరదుడై వేణుమోహను భంగిమమున
            స్వామి మలయప్ప చినశేషవాహనమున
      మాడవీదుల విహరించు మహిత ఠీవి
           దర్శనంబును బొందుడు ధన్యులగుడు.
 రచన: డా. యస్వీ. రాఘవేంద్రరావు

పెద్దశేషవాహనం


  శ్రీవేంకటేశ్వరస్వామి వారి
      బ్రహ్మోత్సవ వాహనవైభవం, శ్రీనివాస మంగాపురం 
               

మ. అదిగో కాంచుడు ! శేషవాహనంబుపై సాలంకృతుండై ప్రభా
     ముదమౌ వజ్రకిరీటధారియయి యామోదాగ్రమాలల్ ధరిం
     చి, ధరాశ్రీమహిషీసమేతుడయి యా శ్రీవిష్ణురూపంబునన్
     సదయన్ వేంకటసామి భక్తతతికిన్ సాక్షాత్కరించెన్ దగన్.
 రచన: డా. యస్వీ. రాఘవేంద్రరావు

Sunday 12 February 2012

వాహన వైభవం


  శ్రీవేంకటేశ్వరస్వామి వారి
      బ్రహ్మోత్సవ వాహనవైభవం,శ్రీనివాస మంగాపురం 
మ. గజశేషాదిక వాహనంబుల సువిఖ్యాతాప్త దేవేరులున్
             నిజపట్టంబున మాడవీదుల సదా నీలాభ్రదేహుండు తా
                ధ్వజఛత్రాదిక లాంఛనంబుల భళా ! వాహ్యాళి గావించుచున్
     నిజభక్తాళికి దర్శనం బిడు శతానీకాతిభోగంబులన్.
 రచన: డా. యస్వీ. రాఘవేంద్రరావు

Saturday 11 February 2012

హితకారిణీ శతజయంత్యుత్సవ ప్రత్యేక సంచిక





ఆహ్వానం

అష్టావధానం జరుపు తేదీ:- 12 - 02 - 2012. ఆదివారం
సమయము:- మధ్యాహ్నం  3 గంటలకు.
స్థలము:- శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కోవెల ప్రాంగణము. జయప్రకాశ్ నారాయణ్ నగర్, మియాపూర్, హైదరాబాదు.
అవధాని పేరు:- డా.కట్టమూరి చంద్రశేఖరం.
తప్పక రండి.
వివరములకు సెల్ నెంబర్. 9247238537.
తప్పక రండి.

Wednesday 8 February 2012

వైతాళిక

శ్రీ కందుకూరి వీరేశలింగం తీస్టిక్ కాలేజీ సిల్వర్ జూబ్లీ సావనీర్ 



స్పీకర్  గారి సందేశం
ఆంధ్ర  విశ్వ విద్యాలయం ఉప కులపతి సందేశం 
కలెక్టర్ గారి సందేశం 
స్పీకర్ యునమల రామ కృష్ణుని గారిచే  రజతోత్సవ సంచిక ఆవిష్కరణ