audio

http://www.esnips.com/doc/2e27b7ac-9938-4b1c-99d6-6182517d796d/2.padyam-teluguvadi-aasti

Thursday 9 August 2012

చల్లనైన ఓ తల్లి! - ఉల్లమందు నీ ధ్యాస

౧౪.              రచన: డా|| యస్వీ. రాఘవేంద్రరావు
        ("పెళ్ళికానుక" చిత్రంలోని "ఆడేపాడే పసివాడా !" వరుస)

పల్లవి||  చల్లనైన ఓ తల్లి! - ఉల్లమందు నీ ధ్యాస
         ఎల్లకాలముండునటుల దీవించుమా !
         పిల్లలతో నిండుగ - ఇల్లంత పండుగ
         చల్లగ నొనరింపుమా ! - చల్లగ నొనరింపుమా !       ||చల్లనైన||

|| ౧.   ఐదువతనమివ్వ - నీకన్న మిన్న
         వెదకిన లేరీ - జగమున నెన్న
         హృదయములోన - ధార్మిక చింత
         ఉదయముపొంద - వరమీవమ్మ !
         తథ్యముగాను - నీవంటి దేవత
         వెదకిన లేదిలలో - వెదకిన లేదిలలో                  ||చల్లనైన||

|| ౨.   ఇహలోకంబె - నిత్యంబంచు
          అహమున కొందఱు - నిను విడనాడి
          ఊహాతీతం - పరలోకంబని
          విహరణ చేతురు - మూర్ఖు లిధరను
          ఊహించగ - భవసాగరమీద
          మహిలో నీచింతెకదా ! - మహిలో నీ చింతెకదా !      ||చల్లనైన||

Wednesday 8 August 2012

శ్రీలక్ష్మిదేవీ ! - సిరులిచ్చు తల్లీ


౬.              రచన: డా|| యస్వీ. రాఘవేంద్రరావు
            ("బాటసారి" చిత్రంలోని "ఓ బాటసారీ" వరుస)
పల్లవి||    శ్రీలక్ష్మిదేవీ ! - సిరులిచ్చు తల్లీ !
           మారునిమాతా - మమ్మేలవమ్మా !                    ||శ్రీలక్ష్మి||
|| ౧.     నీపూజకూ - నీసేవకూ
           దూరమైతి మేమూ - ధరలోనా
           సదా నీదు భక్తీ - మది పొందు శక్తీ
           ఒసంగుము ముక్తీ ! - ఓ ఆదిశక్తీ !                      ||శ్రీలక్ష్మి||
|  ౨.    మము బ్రోచి నీవూ - మనజేయుమమ్మా !
           అజ్ఞానతిమిరం - హరియించవమ్మా !
           సదానీదు నాజ్ఞ - శిరసావహింతు
           సరసీరుహాక్షీ ! - సౌభాగ్యలక్ష్మీ !

Thursday 26 July 2012

విశ్వనాథ వారి ఆంధ్రప్రశస్తి 13

సాహిత్య ప్రసంగం 
ప్రసంగకర్త :డా.యస్వీ రాఘవేంద్ర రావు