audio

http://www.esnips.com/doc/2e27b7ac-9938-4b1c-99d6-6182517d796d/2.padyam-teluguvadi-aasti

Thursday, 9 August 2012

చల్లనైన ఓ తల్లి! - ఉల్లమందు నీ ధ్యాస

౧౪.              రచన: డా|| యస్వీ. రాఘవేంద్రరావు
        ("పెళ్ళికానుక" చిత్రంలోని "ఆడేపాడే పసివాడా !" వరుస)

పల్లవి||  చల్లనైన ఓ తల్లి! - ఉల్లమందు నీ ధ్యాస
         ఎల్లకాలముండునటుల దీవించుమా !
         పిల్లలతో నిండుగ - ఇల్లంత పండుగ
         చల్లగ నొనరింపుమా ! - చల్లగ నొనరింపుమా !       ||చల్లనైన||

|| ౧.   ఐదువతనమివ్వ - నీకన్న మిన్న
         వెదకిన లేరీ - జగమున నెన్న
         హృదయములోన - ధార్మిక చింత
         ఉదయముపొంద - వరమీవమ్మ !
         తథ్యముగాను - నీవంటి దేవత
         వెదకిన లేదిలలో - వెదకిన లేదిలలో                  ||చల్లనైన||

|| ౨.   ఇహలోకంబె - నిత్యంబంచు
          అహమున కొందఱు - నిను విడనాడి
          ఊహాతీతం - పరలోకంబని
          విహరణ చేతురు - మూర్ఖు లిధరను
          ఊహించగ - భవసాగరమీద
          మహిలో నీచింతెకదా ! - మహిలో నీ చింతెకదా !      ||చల్లనైన||

No comments:

Post a Comment