4/8/2011 కరుణశ్రీ శత జయంతి సదర్భము గా
"కుంతీకుమారి" రాగాంతరంగంబును,
కన్నకడుపు తీపి కన్న సుకవి !
ఊలుదారపుటురి,పూలబాలల గోడు
సానుభూతిని గన్న సాధుమూర్తి !
తాలింపు గుమగుమల్ ధాత్రి నింపినదంచు
"ననసూయ" పొగడిన యమరకీర్తి !
"తెనుగు తల్లి" ని పిల్చి యనుగు బిడ్డల దిద్ద
గద్దించి యడిగిన ముద్దుబిడ్డ !
తేట తెనుగు మాటల తేనె యూట ముంచి,
"కరుణ" రసమున మెదిపి, సత్కవిత లల్లి
ప్రజల మది నిల్చి తీవు "పాపయ్య శాస్త్రి !"
అందుకోవయ్య సుకవి ! జోహారు లివిగొ !
డా .యస్వీ రాఘవేంద్ర రావు .
No comments:
Post a Comment