రచన: డా|| యస్వీ. రాఘవేంద్రరావు
("ఇలవేలుపు" చిత్రం లోని "అన్నా! అన్నా! విన్నావా!" పాట వరుస)
పల్లవి|| నందకుమార రారా ! - నవనీతచోర రారా !
దానవవంశ వినాశకరా ! - దర్శనమీయగ జాగేల ? ||నంద||
చ|| ౧. మన్ను తిన్నావని అన్ననగా - అమ్మకు చూపితి భువనాల
మాకుల రోటను గూలిచి నీవు - బాపితి శాపము లవలీల ||నంద||
చ|| ౨. గోపబాలల జుట్టు ముడేసి - గోవత్సము లదలించినవాడా !
గోపికరమణుల పుట్టములనుగొని - గోప్యముగా చెట్టెక్కినవాడా ! ||నంద||
చ|| ౩. గోవర్ధనగిరి నెత్తినవాడా ! - గోకులరక్షక గోపాలా !
కాళియమర్దన ! కృపజూడ - కంస సంహరణా ! రావేలా ! ||నంద||
చ|| ౪. గోపికలోలా ! నీలీల - కానగ నేరికి తరమౌను ?
కరుణాసాగర ! రావేల - కావగదాసుని రాఘవుని ||నంద||
No comments:
Post a Comment