రచన: డా|| యస్వీ. రాఘవేంద్రరావు
( "జయసింహ" చిత్రంలోని "ఈనాటి ఈ హాయి" పాట వరుస)
పల్లవి|| నీలీల తెలియగనూ - ఇలనెవ్వారి తరమౌను ||నీలీల||
చ|| ౧. నీతలపుతోనే - తపియించిపోయే
ఈతనువు నీదమ్మా !
నీసేవలే నా సౌభాగ్యమమ్మా !
నాశ్రీయు నాసౌఖ్య మీవేకదా ! ||నీలీల||
౨. ఏనాటి తపమో - ఏ పుణ్యఫలమో !
ఈనాటి ఈ జన్మా
నీపూజలే యిక నిరతంబు నేను
నీమముగ నొనరించి తరియింతునూ ||నీలీల||
౩. మురిసేములే - మైమఱచేములే ఇక నీ
నీచరణపూజలతో
దారిద్ర్యమనెడి శార్దూలవాత
ఎర రీతి బడకుండ కాపాడుమా ! ||నీలీల||
No comments:
Post a Comment