రచన: డా|| యస్వీ. రాఘవేంద్రరావు
((చాయ: "చక్రపాణి" చిత్రంలోని "ఉయ్యాలజంబాల")
పల్లవి|| జైలక్ష్మి ! జైలక్ష్మి ! అనుచు పాడరా !
జగతిలోన నీజన్మ సార్థకము చేయరా ! ||జైలక్ష్మి||
చ|| ౧. క్షీరసాగరుని యనుగుపట్టియై పుట్టి
క్షీరాంబుధిశయనుని చెయి ముదమున చేపట్టి
వైకుంఠము మెట్టిన వందితవరలక్ష్మి !
ఇక్కట్టు లెట్టివైన ఇట్టె పోగొట్టు తల్లి ! ||జైలక్ష్మి||
చ|| ౨. సుఖదు:ఖము లెన్నగా సంసారజలధిలో
తరంగాలె గావా తలపగ నోజీవా !
ఎఱిగుండియు మానవులిక వెఱపుజెందనేల ?
శ్రీలక్ష్మినె సతతము మది స్మరియింపగలేరా ? ||జైలక్ష్మి||
చ|| ౩. ఎట్టి తాపసులనైన ఇట్టె చలనమొనరించు
నట్టి కామునిగన్న కరుణాలవాల !
రమణుల సౌభాగ్యలక్ష్మి రాజీవనేత్ర !
రక్షించగ వేగరావె దాసుని రాఘవుని ||జైలక్ష్మి||
No comments:
Post a Comment