రచన: డా|| యస్వీ. రాఘవేంద్రరావు
("సత్యలింగ నాయకరునకు సఖియ హారతులివ్వరే" పాట వరుస)
పల్లవి|| జానకీ రఘురాములకును - సఖియ హారతి నివ్వరే ! ||జానకీ||
చ|| ౧. పట్టుదలతో హరునిచాపము - పట్టి నడిమికి ద్రుంచెనే
మట్టిబుట్టిన జానకమ్మను - పట్టమహిషిగ చేకొనె
చట్టురాయై యున్న అహల్యకు - అట్టె శాపము బాపెనే
అట్టి రాఘవునకు పళ్ళెము - పట్టి హారతి నివ్వరే ! ||జానకీ||
చ|| ౨.ఘోర రావణ కుంభకర్ణుల - గర్వమడచిన శూరుడే
మేరునగసమధీరుడే మన - మారుతాత్మజు బ్రోచెనే
కరుణజలనిధి రాముడే - మన మారుతాత్మజు బ్రోచెనే
కారణార్థము జననమొందిన - కరుణజలనిధి రాముడే
అరిభయంకర దాశరథికి - హారతివ్వగ రాగదే || ||జానకీ||
No comments:
Post a Comment