audio
http://www.esnips.com/doc/2e27b7ac-9938-4b1c-99d6-6182517d796d/2.padyam-teluguvadi-aasti
Saturday, 31 March 2012
Friday, 30 March 2012
కైలాస సభ 3
సాహితీ రూపకం
దృశ్య చిత్రీకరణ :యస్.రవి కిశోర్
భాగం 3
(డా.కేసాప్రగడ సత్యనారాయణ గారిచే కైలాస సభ పరిచయ కార్యక్రమం )
Thursday, 29 March 2012
Wednesday, 28 March 2012
కైలాస సభ 2
సాహితీ రూపకం
దృశ్య చిత్రీకరణ ;యస్.రవి కిశోర్
భాగం 2
(డా.కేసాప్రగడ సత్యనారాయణ గారిచే కైలాస సభ పరిచయ కార్యక్రమం )
Tuesday, 27 March 2012
"నందన" నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు !
"నందన" వత్సరమా ! యా
నందము కల్గించి తెల్గునాటను ప్రజకున్,
అందఱి సొంతము జేయుము !
కొందఱికే యున్న కూడు, గుడ్డయు, గూడున్.
డా.యస్వీరాఘవేంద్ర రావు
Monday, 26 March 2012
కైలాస సభ 1
సాహితీ రూపకం
దృశ్య చిత్రీకరణ ;యస్.రవి కిశోర్
భాగం 1
(కేసాప్రగడ సత్యనారాయణ గారిచే కైలాస సభ పరిచయ కార్యక్రమం )Sunday, 25 March 2012
Saturday, 24 March 2012
Thursday, 22 March 2012
Wednesday, 21 March 2012
Tuesday, 20 March 2012
Thursday, 15 March 2012
Tuesday, 13 March 2012
Monday, 12 March 2012
Friday, 9 March 2012
మాతృభాషను సేవించి మనగదయ్య !
మ. తులలేనట్టిది మాతృభాష, జననీతుల్యంబు, వెన్నంటి ని
న్నిలలో గాచును, పాండితిన్ మనుచు నిన్నెంతేని సంపూర్ణతన్,
సులభగ్రాహ్యము బొధనాధ్యయనముల్ సూ ! మాతృభాషావిధిన్,
అల "ప్రాచీనత" గాంచి తెల్గు, ధర గణ్యంబౌచు వెల్గొందదే ?
గీ. సంస్కృతి పరిరక్షకము భాషామతల్లి,
జాతికిన్ జీవగఱ్ఱ భాషా’మతల్లి,
"నాదు భాష, నాదేశము, నాదు ప్రజలు"
ననెడు నభిమానము గలిగి మనగవలయు.
సీ. "అక్షరరమ్యత" నలరించుచున్ మించు
మానసోల్లాసిని మాతృభాష,
"నాటకీయత గల్గి తేటయై యొప్పెడు
జాతీయదృశ్యంబు మాతృభాష,
"జిగిబిగి యల్లికన్" జిలిబిలి మాటలన్
మంజులంబైనది మాతృభాష,
"ముద్దుపల్కుల"తోడ మురిపంబు లొల్కుచు
మకరందముప్పొంగు మాతృభాష,
పరవశింపజేయు "పదగుంభనంబు"తో
"దేశభాషలందు తెలుగు లెస్స"
అనెడి కీర్తిగన్న యమృతధారాస్యంది
మాననీయము మన మాతృభాష.
గీ. కోకిలమ్మ పాటయు, పసికూన ముద్దు
మాట, ముత్యాలమూటయు, మల్లెతోట,
తేటిపాట, నెమలియాట, తేనెయూట,
జగతిని తెలుగుమాటకు సాటిరావు.
గీ. చలువవెన్నెలయు, జిలుగువలువ, చెలియ
కులుకు, కలువచెలువమును, చిలుకపలుకు,
మలయపవనంబు, సెలయేటి కలరుతంబు,
తులయగునె యిలను తెలుగు పలుకుబడికి ?
మ. పరిరక్షించెను పూర్వసంస్కృతి కళాపారమ్యరమ్యాకృతిన్,
వరలెన్ నీత్యుపదేశవాఙ్మధురసస్వాదుత్వసం పన్నమై,
తరుణీసమ్మితకావ్యసౌరభలసత్సంతుష్ టదిక్చక్రమై,
విరిసెన్ వేయిదళాల పద్మమయి యీ వేయేండ్ల సాహిత్యమే.
సీ. ఆపాతమధురమై యానందమందించు
దివ్యవాక్సతి మనతెలుగుభాష,
ఆలోచనామృతమై చవులూరించు
తియ్యందనంబుల తెలుగుభాష,
జగతి నజంతభాషగ కీర్తి గడియించు
తేటతేట నుడుల తెలుగుభాష,
సరసాంగి, యనుకూల, సరళయై యొదిగెడు
దేవభాషాపుత్రి తెలుగుభాష,
గీ. "అట్టిభాష నేర్చుకొనుట, యట్టి దేశ
మందు పుట్టుటయును నన్న నల్ప ఫలమె ?
అది తప:ఫలం"బనుట యథార్థమయ్య !
మాతృభాషను సేవించి మనగదయ్య !
డా.యస్వీరాఘవేంద్ర రావు
(ది.౨౬.౦౨.౨౦౧౨ తేదీని ఆంధ్రపద్యకవితాసదస్సు,తూర్పుగో దావరి
జిల్లాశాఖచేజిల్లా శాఖ ఆధ్వర్యంలో" తెలుగు తియ్యందనము"పై
నిర్వహింపబడినపద్యకవిసమ్మేళనా నికి అధ్యక్షత వహించి
గానం చేయబడినవి.)
Wednesday, 7 March 2012
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భముగా
రమ్యగుణలక్ష్మి ! శ్రీమతిరాజ్యలక్ష్మి !
శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి
కొమ్మల కొమ్మవై, అనదగుమ్మల బాముల బాప నమ్మవై,
పిమ్మట రాజ్యలక్ష్మివయి, పేదల పాలిటి భాగ్యలక్ష్మివై,
సమ్మదమంద గూర్చితివి జంటల పెండిలి పేరటాలివై,
యెమ్మెయి తీఱు నీదు ఋణ మిమ్మహి ? తీఱదు జన్మజన్మలన్.
"కన్నప్రేమ" కన్నమిన్న "పెంచిన ప్రేమ"
యన్న సూక్తి నిక్క మయ్యెనమ్మ !
మీకు సంతు లేమి లోకుల భాగ్యమ్ము
జాలి పంట పండె జంట యెదల.
మూగవోయిన వీణలు మ్రోగ గల్గె,
వాడిపోయిన కుసుమాలు వాసి గాంచె
ప్రాజ్య కారుణ్య వారాశి ! "రాజ్యలక్ష్మి !"
ధన్య మానవతామూర్తి ! మాన్య కీర్తి !
దిక్కు మొక్కును లేక దీన స్థితిని గుందు
సారసాక్షుల ప్రీతి సాకు నేర్పు,
ముక్కుపచ్చారని మురిపాలు నేరని
బాల వితంతుల నేలు నేర్పు,
గాజుల పూవుల మోజు తీరని ముగ్ధ
తరుణాబ్జముఖుల నోదార్చు నేర్పు,
"వంటయింటికె", "చంటిపాపలకే యింతి,
చదువేల ?" యనువారి నెదురు నేర్పు,
తల్లి ! నీ కివి జన్మజాత సుగుణంబు
లట్టి నీచేత మగడు విఖ్యాతి మెఱసె
భర్తృభావానుకూలశుంభత్ప్రవృత్తి !
"రమ్యగుణలక్ష్మి ! శ్రీమతిరాజ్యలక్ష్మి !
డా.యస్వీ రాఘవేంద్ర రావు .
Tuesday, 6 March 2012
" దివ్యగీత "
ఉ. తెల్లదొరల్ ప్రజాహితమె ధ్యేయ మటంచు దలంచి యేలరే ?
కొల్లగొనంగలేదె పలుకోటుల దెల్లముగా; స్వదేశులౌ
నల్లదొరల్ ప్రజా౨హితమె ధ్యేయమటంచు దలంచి యేలుచున్
కొల్లగొనంగ దాచె పలుకోటుల "నల్లధనంబు" బ్యాంకులన్.
ఉ ."కాటను" నిర్మితంబైన కట్టడముల్ బహుకాలముండె, చే
వాటముతోడ నీతి విడి వారధులన్ రచియింప గూలవే ?
నేటి స్వతంత్రభారతపు నీతిది, లంచమె రాజ్యమేలు, మో
మోటములేక కోటులను మూటలుగట్టుట పాటి యయ్యెడిన్.
గీ. "మనకు స్వాతంత్ర్యమేతెంచె, మనకు స్వేచ్ఛ
మనప్రజలు, మనదేశంబు, మనధనంబు
తినినయంతయు తిని దాచుకొనగవలయు"
నేతలకిదె నేడిల "దివ్య గీత" యయ్యె.
మ. పరదాస్యంబున మ్రగ్గుచున్న భరతాంబాశృంఖలాఛేదనన్
అరదండంబుల, లాఠిదెబ్బలను, కారాగారవాసంబులన్
అరుసంబొప్పగ స్వీకరించి గత నేత్రాగ్రేసరుల్ గ్రాలరే ?
తరలింపంగ ప్రజాధనంబు మన నేతల్ దక్షతన్ మీఱరే ?
ఉ. లంచము "ఫైలు" సాగుటకు, లంచము కార్యము పూర్తియౌటకున్,
లంచము "జన్మపత్రముల", లంచము పొందగ "చావుపత్రముల్",
లంచము "దైవవీక్షణకు", లంచము "ధార్మికవైద్యశాలలన్",
లంచమయంబు సర్వధర, లంచమె లంచమె రాజ్యమేలెడిన్.
గీ. "కుంభకోణాల" మాటున కూడబెట్టి
దోచు సొమ్ము విదేశాల దాచుకొనుచు
"బ్యాంకు లాకర్లు పట్టక పసిడి దాచ
పాన్పు, సింహపీఠులజేసి స్వర్ణమయము
"ఇంద్రవైభవంబు, కుబేరసాంద్రనిధులు
స్వంత" మని విఱ్ఱవీగెడు స్వార్ఠపరుల
"భరతము"ను బట్టగా బూనవలయు "యువత".
గీ. "లోకపాల్ బిల్లు" చర్చలలో నవగత
మయ్యె నేతృమనోగత మందఱి కిల,
వేళ్ళుబారిన "యవినీతివృక్షతతుల"
సర్వనాశనమ్ము మనకు సాధ్యమగునొ !
డా.యస్వీరాఘవేంద్ర రావు
(ది. ౨౬.౦౧.౨౦౧౨ తేదీని రాజమహేంద్రవరం ఆదిత్య డిగ్రీకళాశాలలో "స్వతంత్ర
భారతంలో అవినీతి" అనే విషయంపై ఆంధ్రపద్యకవితాసదస్సు తూర్పు గోదావరి
జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహింపబడిన పద్యకవిసమ్మేళనానికి అధ్యక్షత వహించి
గానం చేయబడినవి.)
Monday, 5 March 2012
Sunday, 4 March 2012
Saturday, 3 March 2012
Thursday, 1 March 2012
Subscribe to:
Posts (Atom)