audio
http://www.esnips.com/doc/2e27b7ac-9938-4b1c-99d6-6182517d796d/2.padyam-teluguvadi-aasti
Friday, 10 August 2012
Thursday, 9 August 2012
చల్లనైన ఓ తల్లి! - ఉల్లమందు నీ ధ్యాస
౧౪. రచన: డా|| యస్వీ. రాఘవేంద్రరావు
("పెళ్ళికానుక" చిత్రంలోని "ఆడేపాడే పసివాడా !" వరుస)
పల్లవి|| చల్లనైన ఓ తల్లి! - ఉల్లమందు నీ ధ్యాస
ఎల్లకాలముండునటుల దీవించుమా !
పిల్లలతో నిండుగ - ఇల్లంత పండుగ
చల్లగ నొనరింపుమా ! - చల్లగ నొనరింపుమా ! ||చల్లనైన||
చ|| ౧. ఐదువతనమివ్వ - నీకన్న మిన్న
వెదకిన లేరీ - జగమున నెన్న
హృదయములోన - ధార్మిక చింత
ఉదయముపొంద - వరమీవమ్మ !
తథ్యముగాను - నీవంటి దేవత
వెదకిన లేదిలలో - వెదకిన లేదిలలో ||చల్లనైన||
చ|| ౨. ఇహలోకంబె - నిత్యంబంచు
అహమున కొందఱు - నిను విడనాడి
ఊహాతీతం - పరలోకంబని
విహరణ చేతురు - మూర్ఖు లిధరను
ఊహించగ - భవసాగరమీద
మహిలో నీచింతెకదా ! - మహిలో నీ చింతెకదా ! ||చల్లనైన||
Wednesday, 8 August 2012
శ్రీలక్ష్మిదేవీ ! - సిరులిచ్చు తల్లీ
("బాటసారి" చిత్రంలోని "ఓ బాటసారీ" వరుస)
పల్లవి|| శ్రీలక్ష్మిదేవీ ! - సిరులిచ్చు తల్లీ !
మారునిమాతా - మమ్మేలవమ్మా ! ||శ్రీలక్ష్మి||
చ|| ౧. నీపూజకూ - నీసేవకూ
దూరమైతి మేమూ - ధరలోనా
సదా నీదు భక్తీ - మది పొందు శక్తీ
ఒసంగుము ముక్తీ ! - ఓ ఆదిశక్తీ ! ||శ్రీలక్ష్మి||
చ| ౨. మము బ్రోచి నీవూ - మనజేయుమమ్మా !
అజ్ఞానతిమిరం - హరియించవమ్మా !
సదానీదు నాజ్ఞ - శిరసావహింతు
సరసీరుహాక్షీ ! - సౌభాగ్యలక్ష్మీ !
Tuesday, 7 August 2012
Monday, 6 August 2012
Sunday, 5 August 2012
Saturday, 4 August 2012
Subscribe to:
Posts (Atom)

.jpg)
.jpg)
.jpg)
.jpg)
a.jpg)
b.jpg)
c.jpg)