audio

http://www.esnips.com/doc/2e27b7ac-9938-4b1c-99d6-6182517d796d/2.padyam-teluguvadi-aasti

Friday, 29 July 2011

ఆచార్య సినారె.

ఆచార్య సి.నా.రె.జన్మదినోత్సవం సందర్భంగా 
విరిపరిమళ మాహ్వానించు విధమున మక
రందమును జుఱ్ఱినట్లు, మాకందఫలము
నారగించు పగిది తృప్తి నందజేసి
హాయి గొల్పు కదోయి నీ గేయకవిత.

పలికిన పలుకగు గేయము,
ఎలకోయిల తీయని పలుకే యనిపించున్
జలధర గర్జనము పగిది
నలరించును నీదు వాక్కు లనుపమ రీతిన్.

కోకిల మాలపించు తన కోమలగీతి వసంత మందె; యీ
కోకిల విందుసేయు తన కోమలగీతుల నిత్య చైత్రమై ;
ఆ కృషికుండు కాలవశుడై వ్యవసాయము సేయ; చేయడే
ఈ కవికర్షకాగ్రణి యథేచ్చ నిరంతర పద్యసేద్యమున్.


నవ్య చైతన్యమూర్తివి నవకవులకు
భవ్యదీప్తివి వైదుష్య భావుకులకు;
"నవ్వని పువు" గాంచిన యో "సినారె !"నేడు
విశదమయ్యె "విశ్వంభర" విశ్వమూర్తి.


ముంగురు లసియాడు మురిపాలవదనుడై
           చూపఱు లోగొను రూపి యెవడు ?
తెలుగుదనంబది తేటపడునటుల
          దర్శనీయాంబరధారి యెవడు ?
చిఱునవ్వు వెన్నెల చిందించు మోముతో
         నెదుటి వ్యక్తిని పల్కరించు నెవడు ?
తెలుగు వెలుంగులు దేశవిదేశాల
         ప్రసరింపజేసిన ప్రముఖు డెవడు ?

"జ్ఞానపీఠ" పురస్కృతి సత్కృతుండు
నిత్యనూతన చైతన్య నిరతు డెవడు ?
అట్టి ఆచార్యు, కవివరు నాదరించి
ఘనతనొందె రాజమహేంద్ర జనత నేడు.
డా .యస్వీ  రాఘవేంద్ర రావు .

Sunday, 24 July 2011

హరిశ్చంద్ర పద్యాలు, గానం: డా .యస్వీ రాఘవేంద్ర రావు

జూలై 24 కవికోకిల గుర్రం జాషువా వర్ధంతి సందర్భముగా
 

"ప్రజాకవి" జాషువా

 
జూలై 24 కవికోకిల గుర్రం జాషువా వర్ధంతి సందర్భముగా 
 అయిదు తలల నాగేంద్రున కడలిపోయి,
దాని బుసలకు వసివాడు ధరణి గావ
"గబ్బిలము" రచియిచితి వబ్బురముగ
ప్రజల నాల్కల తిరముగ బ్రతుకు "సుకవి !"
డా .యస్వీ రాఘవేంద్ర రావు .

Tuesday, 19 July 2011

మాతృ భాష

  ఆపాత మధురమై యానందమందించు                                                                               
 దివ్య వాక్సతి మన తెనుగుభాష,                                                                                     
 ఆలోచనామృతమై ఆనందమందించు                                                                                 
 తియ్యందనంబుల తెనుగుభాష,
                                             
 జగతినజంతభాషగ కీర్తి గడియించు                                         
 తేటతెలుగునుడుల తెనుగుభాష,                                            
 సరసాంగి యనుకూల సరళయై యొదిగెడు                                   
 దేవభాషాపుత్రి తెనుగుభాష
                                                 
 అట్టి భాష నేర్చుకొనుట యట్టి దేశ                                         
 మందు పుట్టుటయునునన్న నల్ప ఫలమె?                              
 అది తపఃఫలంబనుట యథార్థ మయ్య !                                                                                         
 మాతృభాషను సేవించి మనగదయ్య

కోకిలమ్మ పాటయు, పసికూన ముద్దు
మాట, ముత్యాల మూటయు, మల్లె తోట,
తేటిపాట, నెమలియాట,తెనెయూట                                                                                       
జగతిని తెనుగు మాటకు సాటి్ రావు.
                                                                                                               
 తే.గీ. చలువ వెన్నెలయు,జిలుగు వలువ, చెలియ                                                                
 కులుకు, కలువచెలువమును,చిలుక పలుకు,                                                                  
 మలయ పవనంబు, సెలయేటి కలరుతంబు                                                                      
 తులయగునె యిలను తెలుగు పలుకుబడికి.                       

పరిరక్షించెను పూర్వ సంస్కృతి కళాపారమ్య రమ్యాకృతిన్
వరలెన్నీత్యుపదేశ వాఙ్మధురస స్వాదుత్వసంపన్నయై,
తరుణీసమ్మిత కావ్యసౌరభలసత్సన్తుష్ట దిక్చక్రమై,
విరిసెన్ వేయిదళాలపద్మమయి యీ వేయేండ్ల సాహిత్యమే
డా .యస్వీ  రాఘవేంద్ర రావు .

Wednesday, 6 July 2011

పోతన భాగవతం లోని పద్యాలు(గజేంద్ర మోక్షం )

గానం: డా .యస్వీ రాఘవేంద్ర రావు
Get this widget | Track details | eSnips Social DNA

తిరుపతి వేంకట కవుల పాండవోద్యోగ విజయాల లోని పద్యాలు

గానం: డా .యస్వీ రాఘవేంద్ర రావు


Get this widget | Track details | eSnips Social DNA

నాటక రంగం తో అనుబంధం.

న్యాయనిర్ణేతగా
రంగస్థల మార్తాండ శ్రీ పీసపాటి నరసింహమూర్తి గా రి తో


 
ఆకాశరామన్ననాటకం(1960) ప్రథమ బహుమతి
మనస్తత్వాలు నాటకం(1959) ద్వితీయ బహుమతి
కచట తపలు  నాటకం(1959) ప్రథమ బహుమతి.
 
చికిత్స నాటకం లోని  కొన్ని ఫోటోలు
ఆకాశ రామన్న నాటకంలోని కొన్ని ఫోటోలు
శ్రీకృష్ణదేవరాయలుగా "శ్రీవేంకటేశ్వర వైభవం"లో
రామరాజభూషణునిగా "రాయల విజయం"లో
రాజరాజనరేంద్రుని మంత్రిగా "భారతావతరణం"లో
శ్రీకృష్ణదేవరాయలుగా "శ్రీవేంకటేస్వర వైభవం"లో  రఘునాథరాయలుగా "రఘునాథరాయల సభ"లో