శ్రీనాథ కవివరేణ్యా !
నానాగుణకావ్య విరచనా నైపుణ్యా !
భూనాథాదృత పుణ్యా !
మానిత నిగమార్థ సారమతి ! గుణగణ్యా !
కవిసార్వభౌమ నీవలె
కవితామాతకు నిలిపిన కవిలే డరయన్.
ఉన్నా రిల కవులెందఱొ
కన్నా రల కవిత లల్లి ఘనమౌ యశమున్,
ఉన్నారా ! తెలుగు వెలుగు
చెన్నారగ నీవలె మనిచిన కవులు భువిన్ ?
ఆంధ్రుడని నిన్ను ధర కొందఱాదరింత్రు,
కన్నడుండని కొందఱు గారవింత్రు,
ఎవ్వ రేమనుకొన్న మా కేమి కొదువ ?
"తెలుగు మింటికి నీవొక వెలుగు ఱేడు".
నవరసము లొల్కు భవదీయ కవిత యందు,
నిక్కము "రసరాజ" మొకింత యెక్కువనుట;
అంతమాత్రాన చాటువు లంట గట్టి,
నిన్ను "శృంగారి" యను టిది పన్నుగాదు.
"నైషధంబు విద్వదౌషధం" బని యెంచు
నుత్తమమగు నీదు పొత్త మరసి
"డు,ము,వు,ల సహిత మిది సుమ" యని కొందఱు
దూయుటకును కత "మసూయ " గాదె ?
విదిత యశంబు గంటి విల వింత నడల సీసపద్యముల్
పదనుగ జెప్పి ; సీస మన పన్నుగ నీ శుభనామ మంతటన్
వదనము నుండి వెల్వడును, వాసిగ నిట్టి యచేతనంబులన్
కుదురుగ నెట్లు నర్తిలగ గూర్చితివయ్య ! కవీశాగ్రణీ !
"సంస్కృత ప్రాకృత శౌరసేనీ ప్రాజ్ఞ !"
"అఖిలపురాణ విద్యాప్రవీణ !"
"సర్వలోకేశ్వరార్చన కళాధికశీలి !"
"శారదా వరసుప్రసాదశోభి !"
"మహిత చింతామణీమంత్ర సిద్ధేశ్వర !"
"ఆంధ్ర భాషా నైషధాబ్జభవుడ !"
దీనార టంకాల తీర్థ మాడిన నీవ
అనుభవించితి దైన్య మంత్య దశను
అత్త కోడండ్ర కచిరము పొత్తు భువిని,
ఎవరి కెపు డేగతి యకట ! యెఱుగరాదు,
విధి బలీయ మనుట మహి విశద మయ్యె,
వీలు కా దిల తెలియంగ "కాల హేల !"
ఎంత ధృతిమంతుడవు ? చింత సుంతలేదు
"దివిజ కవివరు గుండియల్ దిగ్గురనగ
నరుగుచున్నాడు శ్రీనాథు డమరపురికి"
ననుట తెలుపదొ నీదు ధైర్యమ్ము సుకవి !
వందన మందుకో సరసభావ ! "మహాకవిసార్వభౌమ !"
ఆనందము సందడింప నల నాక కవీశుల గెల్చి, యీ భువిన్
చిందఱ వందఱై కడు వివర్ణత నున్న సాహితిన్
సుందర బంధుర ప్రవర సుస్థిరతన్ నెలకొల్ప రమ్మికన్.
డా .యస్వీ రాఘవేంద్ర రావు .
నానాగుణకావ్య విరచనా నైపుణ్యా !
భూనాథాదృత పుణ్యా !
మానిత నిగమార్థ సారమతి ! గుణగణ్యా !
కవిసార్వభౌమ నీవలె
భువి దేశాటనము సేసి భూరి యశంబున్
వివిధాస్థానముల తెలుగుకవితామాతకు నిలిపిన కవిలే డరయన్.
ఉన్నా రిల కవులెందఱొ
కన్నా రల కవిత లల్లి ఘనమౌ యశమున్,
ఉన్నారా ! తెలుగు వెలుగు
చెన్నారగ నీవలె మనిచిన కవులు భువిన్ ?
ఆంధ్రుడని నిన్ను ధర కొందఱాదరింత్రు,
కన్నడుండని కొందఱు గారవింత్రు,
ఎవ్వ రేమనుకొన్న మా కేమి కొదువ ?
"తెలుగు మింటికి నీవొక వెలుగు ఱేడు".
నవరసము లొల్కు భవదీయ కవిత యందు,
నిక్కము "రసరాజ" మొకింత యెక్కువనుట;
అంతమాత్రాన చాటువు లంట గట్టి,
నిన్ను "శృంగారి" యను టిది పన్నుగాదు.
"నైషధంబు విద్వదౌషధం" బని యెంచు
నుత్తమమగు నీదు పొత్త మరసి
"డు,ము,వు,ల సహిత మిది సుమ" యని కొందఱు
దూయుటకును కత "మసూయ " గాదె ?
విదిత యశంబు గంటి విల వింత నడల సీసపద్యముల్
పదనుగ జెప్పి ; సీస మన పన్నుగ నీ శుభనామ మంతటన్
వదనము నుండి వెల్వడును, వాసిగ నిట్టి యచేతనంబులన్
కుదురుగ నెట్లు నర్తిలగ గూర్చితివయ్య ! కవీశాగ్రణీ !
"సంస్కృత ప్రాకృత శౌరసేనీ ప్రాజ్ఞ !"
"అఖిలపురాణ విద్యాప్రవీణ !"
"సర్వలోకేశ్వరార్చన కళాధికశీలి !"
"శారదా వరసుప్రసాదశోభి !"
"మహిత చింతామణీమంత్ర సిద్ధేశ్వర !"
"ఆంధ్ర భాషా నైషధాబ్జభవుడ !"
దీనార టంకాల తీర్థ మాడిన నీవ
అనుభవించితి దైన్య మంత్య దశను
అత్త కోడండ్ర కచిరము పొత్తు భువిని,
ఎవరి కెపు డేగతి యకట ! యెఱుగరాదు,
విధి బలీయ మనుట మహి విశద మయ్యె,
వీలు కా దిల తెలియంగ "కాల హేల !"
ఎంత ధృతిమంతుడవు ? చింత సుంతలేదు
"దివిజ కవివరు గుండియల్ దిగ్గురనగ
నరుగుచున్నాడు శ్రీనాథు డమరపురికి"
ననుట తెలుపదొ నీదు ధైర్యమ్ము సుకవి !
వందన మందుకో సరసభావ ! "మహాకవిసార్వభౌమ !"
ఆనందము సందడింప నల నాక కవీశుల గెల్చి, యీ భువిన్
చిందఱ వందఱై కడు వివర్ణత నున్న సాహితిన్
సుందర బంధుర ప్రవర సుస్థిరతన్ నెలకొల్ప రమ్మికన్.
డా .యస్వీ రాఘవేంద్ర రావు .
No comments:
Post a Comment