audio

http://www.esnips.com/doc/2e27b7ac-9938-4b1c-99d6-6182517d796d/2.padyam-teluguvadi-aasti

Sunday, 29 April 2012

భక్తిగీతాలు 3



     రచన : డా|| యస్వీ. రాఘవేంద్రరావు
     ("ప్రేమలేఖలు" చిత్రంలోని "రారాదా" అను పాట వరుస)

పల్లవి||  శ్రీదేవీ ! మది నిన్నే తలతు జననీ !
         నను బ్రోవ వేగరావా ! నీ సేవ చేతునమ్మా !      ||శ్రీదేవీ||
  చ|| ౧. పాదదాసునికిది - శాపమా !
         తొల్లి నేజేసినట్టి - పాపమా !
         వేగ కాపాడ నీకే - భారమా !
         నన్ను వేధింప నీకు - న్యాయమా !                  ||శ్రీదేవీ||
  చ|| ౨. అల వైకుంఠమున - వెలసీ
          ఎల్ల భువనాలనేలే - వేలుపా ! 
          మాబోటి వారి - బాధలా
          మటుమాయమ్ముజేయ - జాగేల ?                   ||శ్రీదేవీ||


No comments:

Post a Comment