audio

http://www.esnips.com/doc/2e27b7ac-9938-4b1c-99d6-6182517d796d/2.padyam-teluguvadi-aasti

Tuesday, 17 April 2012

డా.రాధాకృష్ణన్ వర్ధంతి సందర్భముగా


 
మోదంబందె తెలుంగుజాతి, ప్రజలామోదింప నధ్యక్షుగా
వేదాంతార్థవిశారదా ! సుధ భవద్వేదాంత వక్తృత్వ, మా
హ్లాదంబయ్యె దెలుంగుజాతి ప్రథమాధ్యక్షుండ వీవౌటచే
నాదిన్ నీవు గురుండవౌటను నుపాధ్యాయాళి గర్వించెడిన్.


విశదమైనది నీదు విజ్ఞానధీశక్తి
      యిలలో నుపాధ్యాయవృత్తి కతన
ప్రకటితంబయ్యె నీప్రతిభ మాస్కోనగ
      రమున దౌత్యంబు నెఱపిననాడు
ఉపరాష్ట్రపతిగ, పిదప రాష్ట్రపతిగాగ
      రాణించినది నీదు రాజనీతి,
ఖండఖండాంతర ఖ్యాతి నార్జించిన
      కమనీయ కైవల్య కావ్యకన్య
"భారతీయ తత్త్వము" నీదు భాగ్యదుహిత,
ఆంధ్రకాశికా విశ్వవిద్యాలయముల
తగ నుపాధ్యక్షుడ వయిన ధన్యజీవి !
అందుకోవయ్య ! మా హృదయాంజలులను.
డా.యస్వీ రాఘవేంద్ర రావు .

No comments:

Post a Comment