audio

http://www.esnips.com/doc/2e27b7ac-9938-4b1c-99d6-6182517d796d/2.padyam-teluguvadi-aasti

Thursday 8 September 2011

పిలుపు

పిలుపు 
అక్షరాస్యతా దినోత్సవం సందర్భముగా

ధరణిన్ ధర్మము రక్షితంబయిన నా ధర్మంబె రక్షించు; న
క్షరముల్ కుక్షి సురక్షితంబయిన నశ్రాంతంబు రక్షించు నా
దర మింపార తదక్షరాస్యులను తద్వంశీయ మిత్రావళిన్;
తరమే యెన్నగ నక్షరాస్యులకు నుత్పాదిల్లు ప్రాధాన్యముల్.

అక్షర మొసంగు సంపద లక్షయముగ
అక్షరాస్యున కతులిత యశము గలుగు,
నిల "నిరక్షరకుక్షి" యన్ వెలితి తొలగు
నక్షరాస్యులు కండు మీర లన్నలార !

కన్నులు, చెవులు, చేతులు మున్నగునవి
యెన్ని యున్న మేను, "తల" లేకున్న సున్న,
ఎన్ని గుణములు సంపద లెన్ని యున్న
నక్షరాస్యత లేకున్న నతడు సున్న.

దానము లన్నిట విద్యా
దానమె మిన్నయగు గాన, తా మిద్దఱకున్
పూనుచు దీక్షల నక్షర
దానము సేయుడు, మనుండు ధర్మాభిరతిన్.

అజ్ఞాన మడగించి విజ్ఞాన మొడగూర్చు,
       వ్యవహారవేతృత్వ మందజేయు,
క్రమశిక్షణాయుత క్రమవర్తనము నేర్పు,
       సభల సంభాషించు శక్తి గూర్చు,
సంస్కార భావంబు చక్కగా నలవర్చు,
       సభ్యత సమకూర్చు సరస గతిని,
వినయవిధేయత లినుమడింపగజేయు,
       నిహపర సుఖముల నింపుగూర్చు,
నక్షరాస్యత కితర సామ్యంబు లేదు,
చదువుకొనగ వయస్సును సరకుగొనక
పగలె కాకున్నరాత్రియే పట్టుదలను
పలక బలపాలు చేబట్టి కలిసి రండు.
డా .యస్వీ  రాఘవేంద్ర రావు .


No comments:

Post a Comment