ఆ. మధుర స్వరము తోడ సుధలను చిందించు
గండు కోయిల వలె ఘనత మీర
పండు వెన్నెలేమొ మెండుగ కురిసెను
నిండిపోయె సుధలు గుండె నిండ.
ఆ. కలము గళము నున్న కవివరేణ్య! నేడు నా
జన్మ ధన్యమాయె, జనుల కిచట
తన్మయంబు గలిగె తావక పద్యాళి
వినగ తృప్తి తనువు మనము మురిసె.
ఆ. నీదు కైత విన్న మోదము నిండెను
గద్యతిక్కనార్యు ఘనతజెప్ప
హృద్యమైన పద్య మాద్యంతమును మాకు
ఒడలు పులకరింప నుడివినావు.
శ్రీమతి బిహెచ్. వి. రమాదేవి,
రాజమండ్రి , ఎం.ఏ., ఎం.ఏ., ఎం.ఫిల్.ది.16.04.2011. అధ్యాపకురాలు, ఆదిత్య డిగ్రీ కళాశాల.
(ఆంద్ర కేసరి యువజన సమితి, రాజమండ్రి వారిచే శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి జన్మ గృహం లో నిర్వహింపబడిన షడ్భాషా స్తోత్ర సమ్మేళనం లో డా.యస్వి.రాఘవేంద్రరావు పై ఆశువు గా చెప్పబడినవి)
No comments:
Post a Comment