audio

http://www.esnips.com/doc/2e27b7ac-9938-4b1c-99d6-6182517d796d/2.padyam-teluguvadi-aasti

Thursday, 27 October 2011

దేవేంద్ర సభ


కవిసమ్మేళన సాహితీ కార్యక్రమం 
 జాంపేట ఫ్రెండ్స్ యూనియన్ ఆధ్వర్యంలో 






Tuesday, 25 October 2011

దీపావళి శుభాకాంక్షలతో



దీపావళి శుభాకాంక్షలతో 
భక్తి పాట

రచన:డా.యస్వీ రాఘవేంద్ర రావు .


గానం: శ్రీమతి సంగాడి కామేశ్వరి 

పూజాఫలం  చిత్రం లోని పగలే వెన్నెల పాట  వరుస 
శ్రితజన రక్షక నుతజన పాలక 

రాజరాజనరేంద్ర వసంతోత్సవ


 సాహితీ సదస్సు 
 జాంపేట ఫ్రెండ్స్ యూనియన్ ఆధ్వర్యంలో



Monday, 24 October 2011

తెనాలి రామకృష్ణ విజయం


సాహిత్య సదస్సు 
 జాంపేట ఫ్రెండ్స్ యూనియన్ ఆధ్వర్యంలో 


Sunday, 23 October 2011

ఆంధ్ర పద్య కవితా సదస్సు,తూర్పు గోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో

  ఈ రోజు రాజమండ్రి లో ప్రతి నెలా పద్యం
విశ్వనాథ కవితా సౌందర్యం పై 
పద్య కవి సమ్మేళనం మరియు  
ఉపన్యాసం 
వక్త : డా.టి .వి.నారాయణ రావు 


అక్టోబర్ 18"కవి సమ్రాట్ " శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి వర్ధంతి సందర్భంగా 
"కవి సమ్రాట్ " శ్రీ విశ్వనాథ కు నీరాజనము

రచన,గానం: డా .యస్వీ రాఘవేంద్ర రావు 



Friday, 21 October 2011

ప్రతి నెలా పద్యం

ఆంధ్ర పద్య కవితా సదస్సు 
తూర్పు గోదావరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో 



అక్టోబర్ 18"కవి సమ్రాట్ " శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి వర్ధంతి సందర్భంగా 
"కవి సమ్రాట్ " శ్రీ విశ్వనాథ కు నీరాజనము



సకల సాహితీ ప్రక్రియా స్రష్ట వగుచు
నాంధ్రభాషా ప్రపంచము నద్భుతముగ
"వేయి పడగల " మోసిన "విశ్వనాథ"
ఎటుల సేవించి నీ ఋణ మీగ గలము ?

"చెలియలికట్ట" లేని సువిశేష చిరత్న వినూత్న సాహితీ
జలనిధి ! "కల్పవృక్షము" నొసంగితి, కావ్య సుధారసంబులన్
తెలుగు జనాళి తన్పితివి దివ్యకవీంద్ర ! "కళాప్రపూర్ణ !" నీ
వల "శశిదూతమున్" నెఱపి, తాంధ్రియు వాఙ్మయ కౌముదిం గనెన్.

"ఆంధ్ర పౌరుషము"ను, "నాంధ్ర ప్రశస్తి"యు
దెసల నీ కతమున తేజరిల్లు
"జ్ఞానపీఠ" సు"కవిసమ్రా" డ్ప్రథితకీర్తి !
వీక దనరిన "జగదేకవీర !"

నవ్యులలో నవ్యుడవై,
కావ్య పునర్జీవన ఘనకార్య సవన సం
సేవ్యుడవై మంటివి, సం
దీవ్యత్కవిచంద్ర ! కొనుము నీరాజనముల్.

"గిరికుమారుని ప్రేమగీతాలు" నేర్పి,
      "అనార్కలి" భగ్నప్రణయము తెల్పి,
"నర్తనశాల" లో నాట్యాలు నేర్పించి,
                "వేనరాజు కథ" ను విశదపఱచి,
"మాస్వామి" కీర్తించి మహితభక్తి,
       నల "స్వర్గానికి నిచ్చెనల్" రహిని గూర్చి,
"కోకిలమ్మకు పెళ్ళి కూర్మి చేయించి,
        "కిన్నెరసాని" పాటలో కరుణ నింపి,
వివిధ సాహితీ ప్రక్రియా విలసనమున
ఆంధ్ర వాణిని కైసేసి తమరవీర !
ఆర్ష సంస్కృతి "ధర్మచక్రావతార !"
అందుకో విశ్వనాథ ! జోహార్లు శతము
డా .యస్వీ  రాఘవేంద్ర రావు 

యానాం పీపుల్స్ ఫెస్టివల్ లో


సాంస్కృతిక కార్యక్రమం 
భువనవిజయం  

 

Wednesday, 19 October 2011

"రమ్యకీర్తి గులాబు" శ్రీరాజబాబు


 అక్టోబర్ 20 ప్రముఖ చలనచిత్ర హాస్యనటులు
 శ్రీ రాజబాబు జన్మదినోత్సవం సందర్భంగా


            
స్వాగతంబిదే నీకు సుస్వాగతంబు
హాస్యనట సార్వభౌమ! చే నందుకొనుమ!
పటువితరణాది గుణగణ్య! నటవరేణ్య!
"రమ్యకీర్తి గులాబు!"శ్రీరాజబాబు!

తేనెసోనల నొలికించు మానసమున,
నమృతపు ఝరులు చిలికించు మమతతోడ,
నాణిముత్యాల తులకించు వాణితోడ,
మందహాసము పలికించు మధురమూర్తి!

సునిశితంపు హాస్యమ్ము నీ సొమ్ము సుమ్ము!
ఇట్లు కడుపుబ్బ నవ్వించు టెట్టులబ్బె?
పూర్వజన్మసంచిత మహాపుణ్య మేమొ?
కాదు, కా దది ప్రేక్షక ఘనసుకృతము 

జననికి జన్మభూమికి ఘనత గూర్చు
సదయ! చదివితి వీవు మా సంస్థలోన
"పూర్వవిద్యార్థి!" యిది మా కపూర్వ గర్వ
మందుకొనుమోయి! మా హృదయాంజలులను.
నీవు సృష్టించిన నీతిచిత్రంబులే
        చటుల నిర్మాత వనుటకు సాక్షి,
నీతిదాయకములౌ నీ చిత్రగాథలే
         చటుల రచయితవనుటకు సాక్షి,
"కోరుకొండ" కిడిన భూరివిరాళమే
          అతివితరణ సుశీలతకు సాక్షి,
నవకళాకారుల నాదరించెడి తీరు
          లతిదృఢ స్నేహశీలతకు సాక్షి,
రాజబాబు! ఆంధ్రాళి  నీరాజనంబు
లందు నిన్ను సమ్మానించు నధిక భాగ్య
మబ్బె; రాజశబ్దంబు చంద్రార్థ మగుట
నూలుపోగుగ మా"పద్యమాల" గొనుము.
 డా .యస్వీ రాఘవేంద్ర రావు .
(వి.టి కళాశాల విద్యార్థి సంఘము ప్రముఖ చలనచిత్ర హాస్యనటులు
శ్రీ రాజబాబును ది>13/3/1976 తేదీని సన్మానించిన సందర్భమును
పురస్కరించుకుని సమర్పించిన "పద్యమాల")


                         
  రాజమండ్రి లో ఆవిష్కరింపబడిన శ్రీ రాజబాబు శిలా విగ్రహం 

Sunday, 16 October 2011