audio

http://www.esnips.com/doc/2e27b7ac-9938-4b1c-99d6-6182517d796d/2.padyam-teluguvadi-aasti

Wednesday, 5 October 2011

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవ స్వర్ణరథోత్సవ వాహనవైభవం



తిరుమల,తిరుపతి శ్రీ వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు


  తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి
      బ్రహ్మోత్సవ వాహనవైభవం



        రచన: డా. యస్వీ. రాఘవేంద్రరావు

మ. గజశేషాదిక వాహనంబుల సువిఖ్యాతాప్త దేవేరులున్
     నిజపట్టంబున మాడవీదుల సదా నీలాభ్రదేహుండు తా
     ధ్వజఛత్రాదిక లాంఛనంబుల భళా ! వాహ్యాళి గావించుచున్
     నిజభక్తాళికి దర్శనం బిడు శతానీకాతిభోగంబులన్.

     స్వర్ణరథోత్సవం

                     తే. దాసభక్తుల నృత్యాలు వాసి గాంచ
                    భజనబృందాలు ముందుగా వచ్చుచుండ
                    వేడ్క శ్రీదేవి భూదేవి వెంటరాగ
                    సాగె నల్లదే శ్రీస్వామి స్వర్ణరథము
                    కనులు మిరుమిట్లుగొల్పెడు కాంచుడయ్య !

No comments:

Post a Comment