audio

http://www.esnips.com/doc/2e27b7ac-9938-4b1c-99d6-6182517d796d/2.padyam-teluguvadi-aasti

Sunday, 1 January 2012

నూతన సంవత్సర శుభాకాంక్షలతో


తియ్యనౌ పల్కు మొల్కల నెయ్యమలర
సమత మమతయు ననెడి సస్యములు పండ
మీదు జీవిత కేదార వీధులందు
క్రొత్త వర్షమ్ము శుభములు కురియుగాక!
                                                  డా .యస్వీ రాఘవేంద్ర రావు .
                                                1/01/2012

2 comments:

  1. మీ మనోకాంక్ష నెరవేరి మేలుకల్గి,
    నూత్న వత్సరమందు వినోద మోద
    భరిత జీవితమ్ము
    తెలుగు ప్రజల కెల్ల
    కూర్ప నా పరమాత్ముని కోరుకొందు.
    --------------

    ReplyDelete
  2. రమణారావు (కమనీయం) గారూ ! నమస్తే !
    " నాదు శుభకామనలపై మీదు స్పంద
    నంబు "కమనీయము", రసభరంబు; నూత్న
    వత్సరం బాయురారోగ్య వైభవంబు
    లొసగుగాక ! "రమణరాయ ! విసృతకీర్తి !"
    భవదీయ,
    డా. యస్వీ. రాఘవేంద్రరావు
    (సుమశ్రీ))

    ReplyDelete